15 August 2019

జై జవాన్

శోకం విలువ ఏంటో తెలియాలి అంటే దేశ సరిహద్దులలో తన బిడ్డని కోల్పోతే ఎలా ఉంటదో ఆ తల్లిని అడగాలి

కన్నీటి విలువ తెలియాలి అంటే దేశ సరిహద్దులలో తన తండ్రిని కోల్పోతే ఎంతగా ఏడిచాడో ఆ బిడ్డని అడగాలి

ఎదురు చూపులు విలువ తెలియాలి అంటే దేశ సరిహద్దులలో తన సోదరుడిని కోల్పోతే ఎలాగైనా వస్తాడేమో అని ఎదురు చూసే సోదరిని అడగాలి


సంతోషం విలువ తెలియాలి అంటే తొలిసారి తన బిడ్డని ఎత్తుకున్నా జవాన్ని అడగాలి

గెలుపు విలువ తెలియాలి అంటే రక్తాన్ని చిందించి శేత్రులపై పోరాడి గెలిచినా విరుడని అడగాలి

త్యాగం విలువ తెలియాలి అంటే తన కుటుంబంతో ఉంటే పొందే ప్రతి ఆనందాన్ని వదులుకున్న సైన్యం లో ఉన్న అందరిని అడగాలి...

జై జవాన్, జై జవాన్
సరిలేరు నికేవ్వరు

జై జవాన్ జై జవాన్
నిలవలేరు నీ ముందు ఎవ్వరు

జై జవాన్, జై జవాన్
ఉండలేరు నీలా ఎవ్వరు

జై జవాన్, జై జవాన్
పోరాడలేరు నీలా ఏ ఒక్కరు

జై జవాన్, జై జవాన్....

బోలో భారత్ మాతకి కి జై.

జై హింద్.



30 July 2019

కాలం కాటు

నా నీడ చెప్పింది నాతో
నువ్వు నాలోనే ఉన్నవాని

నా మాట తీరు చెప్పింది నాతో
నా ఊసులన్నీ నీవెనని

నా చూపు చెప్పింది నాతో
నా కను పాపాల నిండిన రూపం నీవెనని....

నువ్వు నాలో ప్రతీ అణువునా నిండిపోయినవే....
నీ జతలో కాలాన్ని సైతం మరిపించినావే..

అందుకేనేమో కాలం కాటు వేసినట్టు...

నీ ఎడబాటుకు దగ్గెరైనానే

వెలుగే రాని చీకటిలో నిన్ను వెతుకుతున్నానే

నీవు లేని నా బ్రతుకులో నన్నే వదిలేసినానే...

28 July 2019

కలిసిపోనియ్యరాధే




కాటుక నిండిన కనులు
అవి చేసే నాట్యాలు
నన్ను ఆకర్షిస్తుంటే
వాటిని చూడకుండా ఉండేలా?

తడి ఆరని కురులు
వాటి నుంచి కారే నీటి బిందువు
నడుం మడతల నుంచి జారగా
అది చూశాక పెరిగిన గుండె చప్పుడు ఆగేదేలా...?

నీ అధారాలు పలికే మాట కన్నా
నవ్వే ఎక్కువగా పలకరిస్తుంటే
వాటిని చేరకుండా నిలిచేదెలా?

అన్నిటిని చేరిపేసి

నీ కౌగిట బందినై
అధరాల ఆటలో
నిన్ను గెలిచి
      
    నీలో

కలిసిపోనియ్యరాధే చెలి....!


19 July 2019

నీ స్వరం తీయగా


ఎదురు చూసాను నీ మాటకై,
పలకరించావు నన్నే హాయిగా,
చేశావు నన్ను కొంటేగా,
వినిపించావు నీ స్వరం తీయగా,
ఉండిపోయావు మదిలో పదిలంగా,
మార్చేశావు నన్ను మొతంగా..


3 May 2019

నీవు నేను " మనము " అయ్యే క్షణము కోసం

రోజు చూసే రూపమే , ఈ రోజు ఎంటో కొత్తదనం ...
ఏమైపోదునో ఆ రూపం చూడకుంటే అందుకే బందించేశాను నా కనుపాపలా....

రోజు పిలిచే పేరే , ఎందుకో అంత ప్రియం
ఏమవ్వునో ఆ పేరు వినకుంటే అందుకే మార్చేసా నా గుండే సవ్వడిలా....

ఎప్పుడు కలిసి నడిచే చోటే , ఎందుకో ఈ సారి ఇంత అందం ఏమయ్యానో ఆ దారులు వెరైతే అందుకే చెప్పేస్తా మనసులో మాట ఇలా....
           
నిన్ను చూడగానే వేసావే ఎదో మంత్రం
నీ చుట్టూనే తిరగాలని ఎంతో ఆత్రం

ప్రేమేమో అందుకే కోరుకుంటున్నా

ఉదయించాలి నా రోజు నీ నవ్వుల వెలుగులో
నిదురించాలి నీ వాడిలో చల్ల గాలిలో
ఆ రెండింటి మధ్య కాలం సాగని ఇంద్రధనుస్సులా
వీడిపోకు ఏ క్షణమునా మోయాలేను కనులా భారం

నీవు నేను " మనము " అయ్యే క్షణము కోసం నా నిరీక్షణ...!




***** అబ్బాయి అమ్మాయికి చెప్పే మాటలు*****

20 March 2019

కొన్ని కబుర్లు

క్రింద రాసిన లైన్స్ కి ఒక రూల్ ఉంది.

1st లైన్ 10 లెటర్స్ ఉండాలి...
2nd లైన్ 15 లెటర్స్ ఉండాలి...

రెండు కలిపి మీనింగ్ ఫుల్ లైన్స్ అవ్వాలి.
అలా ట్రై చేసిన కొన్ని లైన్స్ ...
చూసి మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి.


ఉహ కోచ్చిన రెక్కలు
నాకోచ్చుంటే గమ్యం నువ్వేనేమో
  *****

విరిగిన అద్దాన్ని చూసాక
తెలిసింది పగిలిన మనసు రూపమేంటో .
*****

అమ్మాయి: నన్ను ప్రేమిస్తారా ... ?
అబ్బాయి: ఇంతక ముందు అనుభవం ఉందా ... ?   
*****

ఇచ్చిన మాట దాటావు,
మనసు గుమ్మం దాటింది.....!
*****

గూగుల్ లో అన్నీ ఉంటాయట
కానీ జాడ లేని నా మనసు మాత్రం లేదు  ...!
*****

"అమ్మా"యిలో అమ్మ ఉంది  కానీ 
 కాసులు  కోసం అమ్మనే అమ్మేసాడు....!
 *****

ఆకలేస్తుందేమో  చూసిన
అమ్మాయినే ఆరగించాడు....!
*****

నన్నే కాదంటావా అంటూ
 చూడటానికి భయపడేలా  కాటేసాడు....!
*****

వద్దు మీతో స్నేహం, లేదు మీపై
నమ్మకం, ఒంటరితనం మాకు మేలు : నిర్భయ
*****

ఒలికే నీ కన్నీరు
వర్షంలా నన్ను తడిపేసింది .....!
*****

వెతికే   రేపటి వెలుగులో
మిగలాలి నా నువ్వు , నీ నేను గా చిరకాలం ...!
*****

అన్నం ముద్దా గొంతు దిగదంటా
చాలా మాటలు  గుటకలువేసాయికనుకా....!
*****

రోజు అస్తమిస్తూ  చెప్తోంది
నీ నవ్వుతో నా రేపు ఉదయించాలని ...!
*****

కరుణిస్తావనే కాంక్షతో నీ
రూపాన్ని కళ్ళలో ని౦పుకొని, కళ్ళు ముస్తాను..!
*****

ఇల్లంతా కాంతులతో నిండింది
మనసు మాత్రం కటిక చీకటి ఏమిటో ...!
*****

నా నవ్వులోని అందమేమిటో
నీ చూపులో తెలిసింది ....!
*****

ఎందుకో  ఈ  మద్య 
ఒంటరితనం  రమ్మని పిలుస్తుంది....!
*****

కాదని విడిచాను కాని
నీ జ్ఞ్యపకాలను కాదనలేకపోతున్నాను....!
*****

కోపం లేదన్నావు మరి
చూసే కనులలో కోపమెందుకో ...!
*****

నీదురించే కళ్ళతో లేను...
వర్షించే కళ్ళతో ఉన్నా...!
*****

(పోతే)తరాలు అంతరిస్తాయి,
ఉన్నా  కూడా బందాలు అంతరిస్తాయా....?
*****

నా జీవిత గమ్యం ..
నీ కోసం ఆరాటం , నీ ప్రేమ కోసం పోరాటం...!
*****

ప్రేమలో ధనవతురాలిని
అది నీకు తెలుపడంలో నిరి పేదని...!
*****

నా మనసు నా బానిస నేను నీ బానిస..!
*****

కనులు మాట్లాడుతున్నాయి
ఏడ్చి ఏడ్చి అలిసిపోయి ...!
*****

ఎవ్వరు లేని అదును చూసి
ఒంటరితనం తనలోకి లాక్కుంటుంది ...!
******

నిన్ను కలిసాకే తెలిసింది
ఈన్నాళ్ళు నాకున్న లోటేమిటో ....!
******

మసిబారిన అద్దం తుడిస్తే
నువ్వుగా నేను కనిపించాను ఏమిటో ....!
*****

నిన్ను విడిచాననుకున్నా
కాని నన్ను నేనే విడిచానని తెలిసింది ....!
*****

క్షణంలో మారిపోయావంటే
నమ్మలేదు , మార్పంటే నన్ను మరవటమా...!
******

చదివినా అర్ధం కానీ భావం నీ ప్రేమా ...!
*****

నువ్వు కానీ నిన్ను నాకు చూపి
ఈ రోజు నన్నే నాకు కాకుండా చేసావు ....!
*****

కబుర్లు చెప్పడానికి  లేవు 
మాటలు అప్పుగా దొరికితే చెప్పరు...!
*****

నన్ను చదివనంటావు
మరీ నా కళ్ళల్లో ప్రేమ అర్ధం కాదేం ...?
******

కళ్ళు నిండిన కలలు
కలలు నీవై నిండిన కథలు ...!
*****

వద్దన్నా నీ ఆలోచనలతో
మనసు ఉక్కిరిబిక్కిరిగా  ఏడిపిస్తుంది..!
*****

కరిగిపోయిన హిమం లా
నిన్నందుకోలేని నేను....!
*****

నిజం చెప్పలేదన్నావు
అబద్ధం ఆడనన్నావు మరీ ఏం చెప్పినటో ....!
****

నిదురించే  కళ్ళు
వర్షిస్తున్నాయి..... అందుకే నిదుర మరిచా.....!
*****

మాట నీది స్నేహం నీది
గాయం మాత్రం నాకే  ఎందుకో ....!
*****

ఉదయించని సూర్యుడి
గురించి ఎందుకో ఈ ఎదురుచూపులు....!
*****

సంతోషమనే వేష దారణలో జీవిస్తున్న ...!
*****

నువ్వన్నదే చేశాను 
ఈలోపే ఆలోచన మారిందా..?
*****

కనుమరుగౌతున్న,  నీ
రూపాన్ని.....  జాలువారే నా కన్నీటితో  చూస్తున్న ....!
*****

అతి ప్రశాంతంగా ఉన్న గది
మనసు పగిలే శబ్దాలతో  దద్దరిల్లింది ...!
*****

మౌనంలాంటి బాధ ఉందిలే
అడిగితే చెప్పడానికి రానందిలే

చూపించమంటే   ఆగమందిలే
ఆగితే కన్నీలు ఆగనన్నవిలే
*****

కన్నీరు ఇంకిన , శ్వాస  ఆగిన
నీపై ప్రేమ అగునా...!
*****

నాపై  లేదు నమ్మకం
కానీ ఒట్టుతో వొచ్చెస్తాయి అన్నీ ..!
*****

తెలిసే ఎడారిలో అడుగేసా..
తడిలేని నీ మదిలో చోటడిగి(నా)
*****

ఆశలు  రాలిపోయాయి
ఆలోచనలు ఆగిపోయాయి...!
*****

మరుపన్నది ఉంటె గాయాన్ని
ఎందుకు మరవలేము .....?
*****

నీకు దూరంగా ఉన్నా
సాగే నా క్షణాలు నీతోనే పయనిస్తున్నాయి .....!

17 March 2019

నీ విరహాన్ని

జాలువారే ఒక కంటి జలపాతం
నీ విరహాన్ని జెయించటానికి పారుతుంటే
మరో కంటి జలపాతం దగ్గేరైన నువ్వు ఎక్కడ దూరమవుతావో అని పారుతుంది....!
నిన్ను కోరుకోవాలో లేక నీ విరహాన్ని కోరుకోవాలో తెలియక

కన్నీటి వేచదనాన్నే ఆస్వాదిస్తున్నాను...!

మారుగైపోదువు

క్షణ కాలపు విరహాన్ని ఓర్వలేకపోయాను జీవితాంతం వెలివేశావా ప్రియా ఇంకా బ్రతికే ఉన్నానని నమ్మేదెలా...?

నీ నీడలా నడవాలనుకున్నాను ...
జ్ఞాపకంలా కూడా లేనని తెలిసి చీకటిలో మిగిలిపోయిన...

కలవైతే కలలోనే మారుగైపోదువు కానీ
నా మనసులో స్థిరపడిపోయావు..
నిన్ను మరువట సాధ్యమా.....?

15 March 2019

కాలం ఆగితే....?

సూర్యుడు ఉదయించక మునుపే జీవితంలో మరో రోజు కోసం పోరాడుతూ, గెలుపు కోసం శ్రమిస్తూ, మంచి కోసం ఆరాటపడుతు....

గమ్యం కోసం చేసే పయనంలో మరణమే గమ్యమంటూ మా నుంచి ఓ ప్రాణాన్ని దూరం చేస్తావు..

ఓ కాలమా,ఆగుమా, ఆగి ఒక్కసారి ఆ ప్రాణం కోసం ఎదురు చూసే కళ్ళని చుడుమా!

గెలుపు కోసం నిదురని సైతం మరిచి కష్ట పడితే , జాలే లేకుండా మళ్ళీ మళ్ళీ ఓటమినే పరిచయం చేస్తావు...

ఓ కాలమా, ఆగుమా, ఆగి గెలుపుకై మార్గాన్ని చూపుమా...!

జీవితంపై ఆశలతో సంతోషం కోసం అన్ని సిద్ధం చేస్తే, అసలు మనసే పగిలిపోయే అంత గాయం చేస్తావు..

ఓ కాలమా, ఆగుమా, ఆగి ఒక్కసారి గాయాన్ని మాయం చేయుమా

ఎంతకని ఓర్చుకోను,ఎన్నాళ్లని పోరాడను ఎడారిదారిలో గమ్యం తెలియని బాటసారిలా ఎండమావిలా అందని మధురస్వప్నాల వెంట ఆగని జీవన పయనం జాలిలేని కాలం వడివడిగా పరిగెడుతూనే ఉంది...

ఇన్నాళ్ళూ,ఇన్నేళ్ళూ ఓపికతో పరుగులు పెడుతున్నా అలసిపోయిన మనసు ఇక నావల్ల కాదంటోంది నిన్నందుకోలేని నిస్సహాయతతో నామీద నాకే జాలేస్తోంది  కరిగేకాలం నన్ను చూసి నవ్వుతుంటే కనురెప్పల నీడల్లో జాలువారే కన్నీరు నిశ్శబ్దపురాత్రిలో నాకు తోడౌతోంది అయినా ఈ పయనం ఆగదు, అలసినా తప్పదుసహనాన్ని కూడదీసుకుని, ఆశలపందిళ్ళు వేసుకునిమళ్ళీ నీతో ప్రయాణం మొదలుపెడతానుకాలమా, నాకోసం ఓ నిమిషం ఆగవూ  ......

జీవితం..... రండి ఒక్కరి చూద్దాం...!


జీవితం అంటే హరివిల్లు లాంటిది....!

హరివిల్లు అని ఎందుకు అన్నానంటే .....

ఆకాశంలో విరిసిన హరివిల్లు అన్ని రంగుల తో కూడిన సమ్మేళనం....

దాన్ని తాకలేము, అందిపుచ్చుకుని దోసిట్లో దాచుకోలేము....

అలాగే జీవితంలో కూడా చాలా రంగులు ఉంటాయి...!

ప్రేమ, సుఖం, కష్టం, గెలుపు, ఓటమి, ఒంటరి తనం, బాధ... ఇంకా ఎన్నో రంగులు చెప్పుకోవాలంటే.

అన్ని నిండినదే జీవితమంటే.. మరీ అలాంటపుడు జీవితంలో ఎపుడు ఒక్కచోటే ఆగిపోకుదదు.

సుఖసతోషాలలోనే ఉండాలని అనుకోకూడదు... మరి ముఖ్యంగా ఓడిపోయినప్పుడు అక్కడే ఉండిపోకూదదు

ఎంతటి సముద్రానికైనా ఓడ్డు అనేది ఉంటుంది.

14 March 2019

బ్రతికించలేవా....?

నీ ఎడబాటుతో...

మౌనం నన్ను పలకరించింది,
నీడసైతం నన్ను కాదని విడిచింది,
గాలి కూడా తాకనంది,
నడిచే దారి ఎడారిలా మారింది,
నా లోకమంతా శున్యమైంది,
వెతికాను ఇంకేదైన నన్ను బ్రతికించలేదాని....

ఒక్కసారి నీ తియ్యని స్వరంతో నాకు ప్రాణం పోయాలేవా?

13 March 2019

నీ స్వరం - చేసే మాయ





నీ స్వరం - నా ఎద చప్పుడు తీరుని మార్చేసింది,

నీ స్వరం - నా కళ్ళల్లో సంతోషాన్ని నింపింది,

నీ స్వరం - నా పెదవులపై  చిరునవ్వుని పలికించింది,

నీ స్వరం - ప్రతి క్షణం నీ తలపులతో నింపేసింది,

చివరిగా....

నీ స్వరం - ఎంత దురానున్నా నిన్ను నాకు దగ్గరా గా చేసింది

ప్రేమంటే...?

చూడాలంటే కానాలేనిది
వినాలంటే ఆలపించలేనిది
చదవాలంటే రాయలేనిది
వర్ణిచాలంటే భాష చాలనిది
కావాలంటే పొందలేనిది
దాచాలంటే దాగలేనిది...!

పొందాలనుకున్నపుడు సొంతమైతే అది ఓ వరం...

అలా కాక కాదని నిరాకరిస్తే నరకం

సొంతమైయ్యాక దూరమైతే ....?

మిగిలేది భారమైన జ్ఞాపకాల జీవితం .

అందుకే ప్రేమ ఎపుడు అర్థం కాని మాయ ప్రపంచం....!

12 March 2019

కన్నీటి వెచ్చదనంలో

నీ రాక కోసం నిలువెల్లా కనులై ఎంతగా ఎదురు చూసానంటే ....?

మంచినీటికి బదులుగా కన్నీరు దాహం తీర్చింది

రాలినిన ప్రతి కన్నీటి బొట్టు జారుతూ చెప్పింది

నిన్ను ప్రేమించే రూపం నీ కంటి పాపగా నిలిచినపుడు

కన్నీటి వెచ్చదనంలో నన్ను దహించకని.....!

నీ ప్రేమ నాదైత

జీవిత ప్రయాణంలో నీ జతగా అడుగులేస్తూ
             నీ తోడు పొందాలని
నా ప్రేమను తెలపాలనుకున్నాను....!

ఆ చోట నాపై ప్రేమ ఉందో లేదో అని
                  ఈ తడబాటు
నీ ప్రేమ నాదైతే అది అమృతం
కాదనే తలంపే ప్రాణం లేని జీవితం...!


గాయపడే కన్నా నాదనే భ్రమలో బ్రతికేస్తా